'తాండూరు అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు'

'తాండూరు అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు'

VKB: తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.18.7 కోట్లు మంజూరు చేసిందని కమిషనర్ యాదగిరి తెలిపారు.అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కేంద్రం రూ.15 కోట్లు, రాష్ట్రం రూ.3.70 కోట్లు కేటాయించాయని ఆయన వివరించారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం, లైట్లు వంటి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.