భర్త చేతిలో భార్య హతం
SRD: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డిలోని ఏపీఆర్ కాలనీలో నివాసముంటున్న భర్త పరమేశ్వరరావు భార్య లీలావతిని గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కొంతకాలంగా భర్త పరమేశ్వరరావు మతిస్థిమితం లేనట్టుగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.