కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మలోలా పాల్గొన్నారు.