VIDEO: హాస్టళ్ళను ఆకస్మికంగా తనిఖీ చేసిన MLA
CTR: పలమనేరు పట్టణంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా రెండు రాష్ట్రాల హాస్టళ్ళను తనిఖీ చేశారు. గుడియాత్తం రోడ్డులోని ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులను అడిగి వారికి అందుతున్న మెనూ వివరాలను తెలుసుకున్నారు. అలాగే, హాస్టల్లో సౌకర్యాలపై సమగ్ర తనిఖీ చేశారు. అదేవిధంగా పరిసరాలను పరిశీలిస్తూ.. విద్యార్థుల భద్రత, ఆహారం, వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.