కార్తీకమాసం ఎంతో పవిత్రమైనది : అదనపు కలెక్టర్
BHPL: భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కార్తీకమాసం ఎంతో పవిత్రమైనదని అన్నారు. కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆమె గణపురం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు నాగరాజు వారిచే పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుని వద్ద కార్తీక దీపాలను వెలిగించారు.