విశాఖలో సీఎం జగన్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

విశాఖ: ఏపీపీఎస్సీలో గ్రూప్-1 చుట్టూ రూ.250 కొట్ల కుంభకోణం జరిగిందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. సోమవారం ఈ కుంభకోణంపై విశాఖ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిలో సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రమేయం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.