వరద ప్రవాహం.. రాకపోకలు బంద్!

వరద ప్రవాహం.. రాకపోకలు బంద్!

NTR: కంచికచర్ల పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్ష్మయ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్ వరకు చిన్నపాటి వర్షాలకే లక్ష్మయ్య వాగుకు వరద వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు.