VIDEO: యూనివర్సిటీ ఎదుట ధర్నా చేపట్టిన విద్యార్థులు

VIDEO: యూనివర్సిటీ ఎదుట ధర్నా చేపట్టిన విద్యార్థులు

అన్నమయ్య: రాజంపేటలోని అన్నమాచార్య యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్ పేరుతో ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 15 వేల చొప్పున రూ. 1.50 కోట్లకు పైగా వసూలు చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఈ మొత్తాన్ని యూనివర్సిటీ ఖాతాల్లో జమ చేయలేదని, శ్రీనివాసులు తమ ఉద్యోగి కాదని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు శనివారం ధర్నాకు దిగారు.