జైలు నుంచి విడుదల.. ఆలయాన్ని సందర్శించిన పిన్నెల్లి

జైలు నుంచి విడుదల.. ఆలయాన్ని సందర్శించిన పిన్నెల్లి

పల్నాడు: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన నకరికల్లు మండలం అడ్డరోడ్డు వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు ఆయనకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.