సాయి కుటుంబానికి రూ.5 లక్షలు అందజేత

సాయి కుటుంబానికి రూ.5 లక్షలు అందజేత

TG: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, TPCC చీఫ్ మహేష్ గౌడ్.. సాయి తల్లికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. BC రిజర్వేషన్లను తప్పక సాధిస్తామని, ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదని అన్నారు. సాయి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.