'భారత సైన్యానికి సెల్యూట్'

'భారత సైన్యానికి సెల్యూట్'

KMR: పాకిస్తాన్‌తో పాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం చేసిన దాడుల పట్ల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం చేస్తూ భారత సైన్యానికి సెల్యూట్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్‌లో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు అమాయక ప్రజలు బలయ్యారని, అలాంటి ఉగ్రవాదులకు భారత సైన్యం దీటైన సమాధానం ఇచ్చిందన్నారు.