విద్యార్థినులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ

NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులకు గురువారం రోజు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ వన్నెల్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ షేక్ మున్ను, వార్డ్ కౌన్సిలర్ నర్సారెడ్డిల ఆధ్వర్యంలో విద్యార్థినులకు అందజేశారు.