'పాడా పేరుతో మా పొట్ట కొట్టొద్దు'

'పాడా పేరుతో మా పొట్ట కొట్టొద్దు'

కాకినాడ: పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) ఏర్పాటులో భాగంగా ఉప్పాడ బస్టాండ్ నుంచి పాతబస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా గల చిరు దుకాణాలను తొలగించాలని మున్సిపల్ అధికారులు చెప్పడం బాధాకరమని వ్యాపారస్థులు మున్సిపల్ కమిషనర్‌కు  శనివారం మొరపెట్టుకున్నారు. తమ పొట్ట కొట్టొద్దని, కుటుంబాలతో రోడ్డున పడతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.