ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి

అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు, వినతులు స్వయంగా విని వెంటనే పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు మంత్రిని సత్కరించారు.