మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మానవత్వం చాటుకున్నారు. ఎమ్మెల్యే ప్రయాణంలో ఉండగా ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే క్షతగాత్రుడిని తన సిబ్బంది సహకారంతో పోలీస్ వాహనంలోకి ఎక్కించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.