యాడికి మండలంలో చీని చెట్ల నరికివేత
ATP: యాడికి మండలం ఓబులాపురం గ్రామంలో రైతు రంగస్వామికు చెందిన చీనీ చెట్లను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. సుమారు నాలుగేళ్ల వయసు కలిగిన 70 చీని చెట్లను నరికారు. ఈ ఘటనపై బాధిత రైతు రంగస్వామి పోలీసులకు ఫిర్యా దు చేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.