నల్లజర్లలో రేవ్ పార్టీ కలకలం

నల్లజర్లలో రేవ్ పార్టీ కలకలం

E.G: జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఉంగుటూరు(M) నారాయణపురానికి చెందిన ఓ పార్టీ నాయకుడు సురేష్ బర్త్ డే సందర్భంగా నల్లజర్లలోని ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ బాలశౌరి తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో సురేష్‌తో పాటు అతని స్నేహితులు 22మందిని, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.