విచారణకు హాజరు కావాల్సిందే
KKD: ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఈ నెల 16 నుంచి 30 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ అధికారి ముందు హాజరుకావాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తనపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలంటూ ఆమె వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. అలాగే ఈ నెల 30న రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టులో హాజరుకావాలంది.