ఆదిలాబాద్ పట్టణంలో దారుణ హత్య

ఆదిలాబాద్ పట్టణంలో దారుణ హత్య

ADB: ఇవాళ తెల్లవారుజామున యువకుడు హత్యకు గురైన ఘటన పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన అర్బాజ్(25)ని ముగ్గురు వ్యక్తులు కర్రలతో కొట్టి చంపేశారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సునీల్ కుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.