రైలు కింద పడి వ్యక్తి మృతి

రైలు కింద పడి వ్యక్తి మృతి

కర్నూల్: ఆదోనిలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆదోని - నగరూరు రైల్వేస్టేషన్ల మధ్య కింద పడి మృతి చెందిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయసు 45- 50సం మధ్య ఉంటుందని రైల్వే ఎస్సై గోపాల్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.