VIDEO: వన దుర్గమ్మకు విదియ ప్రత్యేక పూజలు
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో శనివారం వన దుర్గమ్మ విదియ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు వేదమంత్రాలతో వైదిక శాస్త్రీయ పద్ధతిన అమ్మవారికి పంచామృతాలు పవిత్ర మంజీరా నది గంగాజలంతో అభిషేకం చేసి, సుగంధ పుష్పాలతో అలంకరించారు. మంగళ హారతులు చేసి నైవేద్యం సమర్పించారు.