మండల స్థాయి అధికారులతో రివ్యూ మీటింగ్

SKLM: ఇచ్ఛాపురం మండల కేంద్రంలో తుఫాన్ ప్రత్యేకాధికారి డ్వామా పీడీ సుధాకర్ సోమవారం మండల స్థాయి అధికారులతో రివ్యూ నిర్వహించారు. బంగాళాఖాతం వాయుగుండం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తాగు నీటి ట్యాంక్లు నీటితో నింపుకోవాలి అన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.