జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదు

SRCL: జిల్లాలో నిన్న ఉదయం 8.30 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు కొన్ని చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. గంభీరావుపేట మండలం గజసింగారంలో అత్యధికంగా 2.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డిపేటలో 0.8 మి.మీ, రుద్రంగి, తంగళ్లపల్లి మండలాల్లో 0.5 మి.మీటర్లు ఉండగా, జిల్లాలో మరెక్కడా గణనీయమైన వర్షపాతం నమోదు కాలేదు.