'అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'
VSP: భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రగతిపై మున్సిపల్ మంత్రి పి.నారాయణతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం భేటీ అయ్యారు. కొత్తగా అనేక అంతర్జాతీయ ప్రాజెక్టులు భీమిలి పరిసరాల్లో ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన తదితర అంశాలు చర్చకు వచ్చాయి.