ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: డివిజనల్ అధికారి
NTR: తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తిరువూరు ఆర్డీవో కే.మాధురి హామీ ఇచ్చారు. మొంథా తుఫాను నేపథ్యంలో దెబ్బతిన్న పంటలను శుక్రవారం ఆమె పరిశీలించారు. మండలంలోని చింతలపాడు గ్రామం పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని స్వీకరిస్తామని హామీ ఇచ్చారు.