మార్కాపురంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ప్రకాశం: మార్కాపురం పట్టణంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించిన ఆమె పన్ను వసూళ్లు తగ్గిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడి, ప్రతినెల టార్గెట్లు పెట్టి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయం పరిశీలనలో కూడా పన్నుల వసూళ్లను మెరుగుపరచాలని సూచించారు.