ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 11 నుంచి 30 రోజుల పాటు ఎలక్ట్రిషన్, ఏసీ రిఫ్రిజిరేటర్‌లో యువతకు ఉచిత శిక్షణా తరగతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రామ్ జీ తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించబడును అని తెలిపారు.