‘నూతన మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా’

KMR: నూతనంగా ఏర్పడ్డ పల్వంచ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. శుక్రవారం రాత్రి మండలంలోని వాడి గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని సూచించారు.