VIDEO: మియాపూర్-మదీనాగూడ వద్ద భారీ ట్రాఫిక్ జామ్

RR: మియాపూర్-మదీనాగూడ రహదారి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు కురుస్తున్న వర్షం, మరోవైపు ట్రాఫిక్ వల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నా, వర్షం కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు.