వారం రోజులు వ్యక్తిగత సెలవుపై వెళ్తున్న జిల్లా కలెక్టర్

విజయనగరం జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ మే 4 నుంచి వారం రోజులపాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లనున్నారు. సెలవు అనంతరం ఆయన మే 12న మళ్లీ జిల్లాకు రానున్నారు. ఈ కాలంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఇన్ చార్జి గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం సమాచార పౌరసంబంధాల అధికారి తెలిపారు.