నగరిలో దోచి అమెరికాలో దాచుకుంటున్నాడు: రోజా

నగరిలో దోచి అమెరికాలో దాచుకుంటున్నాడు: రోజా

CTR: ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నగరి ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. 18 నెలల్లో రెండుసార్లు అమెరికాకు వెళ్లి వారాల తరబడి అక్కడే ఉంటున్నారని చెప్పారు. ఆయన నగరికో, తిరుపతికో, విజయవాడకో MLA అనేది తెలియడం లేదన్నారు. నగరిలో దోచుకొని అమెరికాలో దాచుకోవడమే ఆయనకు తెలుసన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.