VIDEO: నల్ల బ్యాడ్జీలు ధరించి సహారా బాధితుల నిరసన
MNCL: మందమర్రి పట్టణంలో తమ డిపాజిట్లను వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ సహారా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ఏజెంట్ల మాటలు నమ్మి పెట్టుబడి పెడితే, గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా పైసలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టార్జితాన్ని వెనక్కి ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.