నదీ పుష్కరాలపై మంత్రి కొండా సమీక్ష

WGL: మంత్రి కొండా సురేఖ సారథ్యంలో 'సరస్వతీ నది పుష్కరాల'పై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పుష్కరాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాశ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.