బీజేపీ జిల్లా కార్యదర్శిగా పద్మశాలి సంఘం డైరెక్టర్

బీజేపీ జిల్లా కార్యదర్శిగా పద్మశాలి సంఘం డైరెక్టర్

JGL: బీజేపీ జిల్లా కార్యదర్శిగా జగిత్యాల పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం డైరెక్టర్ సాంబారి కళావతిని నియమితులయ్యారు. శుక్రవారం పార్టీ అధిష్టానం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కళావతి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతోనికి కృషి చేస్తానని ఆమె అన్నారు.