VIDEO: గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ ధర్నా
KMM: పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలో అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ.. గ్యాస్ కొరతను నివారించడంతో పాటు సామాన్యుడిపై భారం పడకుండా ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సరఫరాను మెరుగుపరచాలని కోరారు.