శాంభవి అమ్మవారి వ్రతంలో ఎమ్మెల్యే

కావలి పట్టణంలోని కలుగోళ శాంభవి అమ్మవారి ఆలయంలో సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతంలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. భక్తులకు ఎమ్మెల్యే ప్రసాదాలు అందించారు. అనంతరం, ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.