పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ.!
మేడ్చల్: ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది. గల్ఫ్ దేశాల నుంచి చమురు సప్లై ఆగిపోతుందని SMలో వార్తలు వస్తున్నాయి. దీంతో మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కట్టారు. వాహనాలు ఫుల్ ట్యాంక్ చేయించి, క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 8-9% పెరిగినప్పటికీ భారత్‌లో పెట్రోల్/డీజిల్ ధరలు ఇంకా పెరగలేదు.