'కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణం'
కోనసీమ: మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి విద్యా కమిటీ ఛైర్మన్ కంకటాల మురళీకృష్ణ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ మేధావిగా పేరు గాంచిన అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం గర్వకారణం అన్నారు.