మహిళా పారిశ్రామికవేత్తల కోసం 'వేదిక' మేళా
VZM: మహిళను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో జిల్లాలో 'వేదిక' మేళా ఘనంగా నిర్వహించారు. వాజి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు సతీమణి గణపతినీడి నీరజ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో సుమారు 25 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహిళల వ్యాపార ప్రయాణంలో తాము ఎప్పుడు అండగా నిలుస్తామని నీరజ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి యశస్వి పాల్గొన్నారు.