నేటితో ముగియనున్న ఉగాది మహోత్సవాలు
NDL: శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహోత్సవాలు నేటితో చివరి రోజుకు చేరుకునున్నాయి. ఉదయం 8:45 గంటలకు ఉత్సవాలకు పూర్ణాహుతి సమర్పించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా.. క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.