నాసిరకం మొక్కలను తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
ELR: దెందులూరు మండలంలోని కొన్ని గ్రామాలలో కొబ్బరి తోటలో క్రిందపడి మొలిచిన నాసిరకం మొక్కలను పూజారి సురేష్ అనే వ్యక్తి తమిళనాడు నర్సరీకి తీసుకువెళ్లి రైతులకు విక్రయిస్తున్నాడని విహెచ్ఎ సమాచారంపై DHO షాజనాయక్ గురువారం పరిశీలించారు. ఎటువంటి ప్రభుత్వ ధ్రువీకరణం లేదని మొక్కలను, వాహనాన్ని సీజ్ చేసి, అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.