లారీ ఢీకొని వ్యక్తి మృతి
MNCL: జైపూర్ (M) ఇందారం ఐకే1ఏ మూలమలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లేష్ (49) అనే పాడిరైతు తన స్వగ్రామం నుంచి గోదావరిఖనికి పాలు విక్రయించడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయాలైన మల్లేష్‌ను 108 అంబులెన్స్‌లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.