కదిరిలో సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత

కదిరిలో సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత

సత్యసాయి: కదిరిలోని ఆర్‌&బీ వసతిగృహంలో కదిరి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందజేశారు. మొత్తం 44 మందికి రూ. 31,05,742 మంజూరు అయిన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప ఉపశమనంగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.