'పకడ్బందీగా పారిశుధ్య పనులు చేపట్టాలి'

'పకడ్బందీగా పారిశుధ్య పనులు చేపట్టాలి'

VZM : పకడ్బందీగా పారిశుధ్య పనులు చేపట్టాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వణాధికారి బీ.సత్యనారాయణ అన్నారు. ఈరోజు గజపతినగరం మండలంలోని గుడివాడలో IVRS కాల్స్, పారిశుధ్య పనులను సీఈవో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం మరుపల్లి సచివాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కళ్యాణి, డిప్యూటీ ఎంపీడీవో జనార్దనరావు పాల్గొన్నారు.