సందడిగా హోలీ జరుపుకున్న మార్వాడీలు
CTR: పుంగనూరు పట్టణంలో మంగళవారం హోలీని మార్వాడీలు సందడిగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. దీంతో పట్టణంలోని వీధులు సందడిగా మారాయి. ప్రతి ఏడు తామంతా కలిసిమెలసి హోలీని హాలిని ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.