మెప్మా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే
కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీలోని మెప్మా విభాగంలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు శుక్రవారం మురముళ్లలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వృత్తిపరంగా వారికి ఎదురవుతున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.