ఉప్పరపల్లెలో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు

ఉప్పరపల్లెలో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు

KDP: సిద్దవటం మండలంలోని శేఖరాజుపల్లె గ్రామ రెవెన్యూ పరిధి ఉప్పరపల్లె గ్రామంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ డీకేటీ స్థలాలలో కజ్జాదారులు జేసీబీ యంత్రంతో చదును చేసి కజ్జాలకు యత్నిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు. ఈ క్రమంలో VRA వెంకటసుబ్బయ్య కబ్జాకు గురైన స్థలాలను ఆదివారం పరిశీలించారు. ఆక్రమణలకు గురైన వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.