'మూడు దశల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి'
SRD: మూడు దశల ఎన్నికలు జిల్లాలో పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. మొదటి, రెండో విడత ఎన్నికలు పూర్తయిన గ్రామాల్లో చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.