నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ప్రకాశం: ఒంగోలు నగరంలో విద్యుత్ లైన్లు మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపి వేస్తున్నట్లు డీఈ రంగారావు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక జడ్పీ కాలనీ, మంగమూరు రోడ్డు, మర్రిచెట్టు కాలనీ, ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు గమనించాలని ఆయన కోరారు.