కృష్ణాష్టమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

NZB: శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మారుతీనగర్‌లో గల కృష్ణ మందీర్‌లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో BRS ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు.